YSRCP Government Neglected Universities Development: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దశాబ్దాలుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వచ్చే డబ్బులను కాజేసింది. గత ఐదేళ్లలో మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం, విజయవాడలోని ఆరోగ్య వర్సిటీ ఆర్థిక పరిస్థితిని జగన్ సర్కారు భ్రష్టుపట్టించింది.