Distance Education Courses Students Problems in Ambedkar Open University : గత వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూర విద్య కోర్సులు చదివే విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. పదేళ్ల ఉమ్మడి రాజధాని కాలం ముగియడంతో హైదరాబాద్‌లో ఉన్న అంబేడ్కర్ వర్సిటీ ద్వారా కోర్సుల్లో చేరలేని పరిస్ధితి నెలకొంది. గత ప్రభుత్వం రాష్ట్రంలో అంబేడ్కర్ ఒపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల వేలాది మందికి అడ్మిషన్లు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి, రాష్ట్రంలో అంబేడ్కర్ ఒపెన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.