Bapatla Medical College Construction Stopped In YSRCP Regime : వైఎస్సార్సీపీ ప్రభుత్వ అడ్డగోలు వ్యవహారాలతో బాపట్ల వైద్యకళాశాల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. నాబార్డ్ నిధులను జగన్ సర్కారు దారి మళ్లించటమే దీనికి ప్రధాన కారణం. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో నిర్మాణ సంస్థ పనుల్ని నిలిపివేసింది. యంత్రాలను సైతం తరలించడంతో వైద్య కళాశాల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపట్ల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో మంజూరైన వైద్య కళాశాలకు గత ప్రభుత్వ నిర్ణయాలు శాపంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Be the first to comment