Tollywood Director jayanth c. Pranjee rememberd about, His Flop Movies wich has he Done with Mahesh babu " Takkari donga" and Pawan kalyan's Teen maar జయంత్ సి.పరాన్జీ టాలీవుడ్ లో ప్రేమించుకుందాం రా..!, బావగారు బాగున్నారా... ఇలాంటి రా ఎండింగ్ సెంటిమెంట్ టైటిళ్ళతో పాటు ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన పెద్ద హిట్స్ కూడా ఙ్ఞాపకం వస్తాయి. చాలారోజులుగా వార్తలకు దూరంగా ఉన్న పరాన్జీ ఈ మధ్య ఒక వెబ్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన పర్సనల్ విశయాలతో పాటు చాలా సినిమాల అనుభవాలనీ ఈ డైరెక్టర్ నవ్వుతూ పంచుకున్నారు.. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ తన గత సినిమాల విషాలలో ఫ్లాపులని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దుమారం రేపేలా ఉన్నాయి... తన కెరీర్లో భారీ ఫ్లాపుల విషయం చెబుతూ టక్కరి దొంగ, తీన్ మార్ ల నాటి అనుభవాలను మళ్ళీ గుర్తు చేసుకున్నాడు ఈ దైరెక్టర్. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే కనిపిస్తున్నారు. ఎలా సాధ్యం? అన్నప్రశ్నకి సమాధానంగా "ఏ విషయంలోను మెంటల్ టెన్షన్ తీసుకోను .. సినిమా ప్లాప్ అయినా అది అంతగా నాపై ప్రభావం చూపించదు" అని అని చెప్పిన జయంత్. " 'టక్కరి దొంగ' సినిమా భారీ నష్టాన్ని తీసుకొచ్చింది .. అప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే వున్నాను. 'టక్కరి దొంగ' ప్లాప్ కావడంతో ఆ అప్పులు తీర్చడానికి నాలుగేళ్లు పట్టింది" అయినా బ్యాలెన్స్డ్ గా ఉండగలిగాను అని చెప్పారు.
Be the first to comment