Plasti Bottle Blast in Rangareddy : బాటిల్‌పై కాలు వేయగానే పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు గాయడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం, కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఎంఎస్ ట్రేడర్స్ పరిశ్రమ ఉంది. ఇది ప్లాస్టిక్ సీసాలు, ఇతర వస్తువులను సేకరిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్లాస్టిక్ సీసాలన్నింటినీ ఒకచోట చేర్చి, వాటిని కంప్రెస్ చేసి ఇతర పరిశ్రమలకు పంపిస్తారు. ఈ బాటిల్స్‌లో కొన్ని ప్రమాదకరమైన రసాయనాలను కలిగినవి కూడా ఉంటాయి. మంగళవారం పరిశ్రమలో పని చేసే మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ(20) నడుస్తూ ఓ సీసాపై కాలు వేశాడు. దీంతో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సాయి కృష్ణ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయారు. సమీపంలో ఉన్న బిహార్‌కు చెందిన మరో కార్మికుడు దిలీప్ (52) కూడా గాయపడ్డారు. ఆ బాటిల్లో రసాయనాలు ఉండటంతోనే పేలుడు సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.