Skip to playerSkip to main content
  • 8 hours ago
Actor Saikumar On BJP Mayor : అనంతపురంలో కూటమి బలపరిచిన బీజేపీ మేయర్ అభ్యర్థి అజేశ్ బాబును గెలిపించి, ట్రిపుల్ ఇంజిన్ వేగంతో అభివృద్ధిని చూడాలని తాను కోరుకుంటున్నట్లు సినీ నటుడు సాయికుమార్ అన్నారు. కూటమి పార్టీల బీజేపీ మేయర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు సోమవారం అనంతపురానికి వచ్చిన సాయికుమార్, తనకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పారు. ఈ రోజు తాను దేశంలో ఎక్కడికి వెళ్లినా, ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణల గురించే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తనకు అనంతపురంతో కొంత అనుబంధం ఉందని, తన తల్లి కర్ణాటక సరిహద్దు రాష్ట్రమైన ముల్బగులకు చెందినవారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతోందని, బీజేపీ అభ్యర్థి అజేశ్ బాబు వల్లే అనంతపురం అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన అన్నారు. కూటమి అభ్యర్థికి ఓటు వేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నగరాభివృద్ధికి అనేక నిధులు వస్తాయని సాయికుమార్ తెలిపారు.

Category

🗞
News
Transcript
00:04Thank you for joining us.
00:40Thank you for joining us.
01:02Thank you for joining us.

Recommended