Ministers Visit To Dharmapuri : జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోదరణ పనులను పరిశీలించారు. అనంతరం రూ.2.57 కోట్ల నిధులతో చేపట్టనున్న ధర్మపురి బస్టాండ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటుకు స్థలాన్ని సేకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్కు అధికారులకు సూచించారు. 2027 ఏడాదిలో జరగనున్న గోదావరి పుష్కారాలను దృష్టిలో పెట్టుకొని మేడారం సమ్మక్క, సారక్క జాతర మాదిరి బాసర నుంచి భద్రాచలం వరకు భక్తుల ప్రయాణానికి సంబంధించి ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. ప్రజా పాలనలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. 360 కోట్ల మంది మహిళలు రూ.13,000 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు చేశారు. - పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి