Skip to playerSkip to main content
  • 2 days ago
Car Overturns Into Temple Tank : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పట్టణంలోని ప్రసిద్దిగాంచిన శివగంగ దేవాలయం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం పక్కనే ఉన్న కోనేరులోకి ఇన్నోవా కారు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో కారులో డ్రైవరు ఒక్కరే ఉండడంతో ప్రాణనష్టం తప్పింది. డ్రైవరు అప్రమత్తమై కారు నీటిలో పూర్తిగా మునిగిపోయే లోపే అప్రమత్తమై బయటకు వచ్చి సురక్షితంగా ఈదుకుంటూ గట్టుకు చేరుకుని బయటపడ్డాడు. రాత్రి వరకు ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో కానీ ప్రమాదం జరిగితే  పరిస్థితి వేరేలా ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నోవా కారు కేశంపేట నుంచి మహేశ్వరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం క్రేన్ సాయంతో కారును కోనేరులోంచి బయటకు తీశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారా లేక నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Category

🗞
News
Transcript
00:03This video is brought to you by S.T.A.L.A.N.

Recommended