Pawan Kalyan Birthday Song : సెప్టెంబర్ 2న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా గిరిజన ప్రాంతంలో ఓ రోజు ముందుగానే పండగ వాతావరణం నెలకొంది. తమ ప్రాంతాలకు చేస్తున్న ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలను కీర్తిస్తూ విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన సురేశ్ అనే రచయిత పాట రాశారు. 'ఏ తల్లి కన్నదో నిన్ను ఓ పవనన్నా' అంటూ ప్రారంభమయ్యే పాట గిరిజనులతో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.ఈ సాంగ్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా చొంపి గ్రామంలో జానపద కళలు, సృజనాత్మకత ఛైర్మన్ గంగులయ్య ఆవిష్కరించారు. గిరిజనులకు వారి ఆచార వ్యవహారాలకు ఎక్కువ విలువనిచ్చే పవన్ కల్యాణ్‌ను కీర్తిస్తూ ఆయన అమలు చేస్తున్న పథకాలను కీర్తిస్తూ ఈ పాట సాగుతుందని గంగులయ్య తెలిపారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్ చేసి పవన్ ముందస్తు జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే గిరిపుత్రులు థింసా నృత్యం చేస్తూ జనసేనానికి అడ్వాన్వ్గా బర్త్ డే విషెస్ తెలిపారు.