Karnataka Kumki Elephants for AP : రాష్ట్రంలో జనావాసాల్లోకి వచ్చేసి పెద్ద ఎత్తున పంటల విధ్వంసంతో పాటు ప్రాణ, ఆస్తినష్టం కలిగిస్తున్న గజరాజుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమికొట్ట గలిగే కుంకీ ఏనుగులు రానున్నాయి. ఇవాళ ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులను అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా వీటి అప్పగింత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇస్తుంది. గజరాజులు చేస్తున్న పంటపొలాల ధ్వంసాన్ని ఇవి కట్టడి చేయనున్నాయి.