Papikondalu Tour Start in AP : చుట్టూ ఎత్తైన కొండలు కనుచూపు మేర పచ్చదనం గోదావరిలో విహారం ఈ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలాంటి సుందరమైన దృశ్యాలు పాపికొండల విహారయాత్రలో కనిపిస్తాయి. ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. దీంతో చాలా మంది సందర్శకులు మళ్లీ పాపికొండల్లో విహారయాత్ర ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల టూర్‌ను తిరిగి ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పరిశీలించాకే యాత్రకు అధికారులు అనుమతిచ్చారు.
Be the first to comment