CM Revanth Reddy Budget Session 2024 Speech : గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మిందని, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు అని సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
Be the first to comment