Heavy Rain in Paderu Agency : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. పాడేరులో వడగళ్ల వాన పడింది. మరోవైపు డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో వాన దంచికొట్టింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలువలు, డైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనాదారులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.
Comments