Sunil Yadav Complains About Threats : పులివెందులలో కొందరు వైఎస్సార్సీపీ నాయకులతో పాటు తోటి నిందితుల నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన అరగంట పైగానే అశోక్ కుమార్తో మాట్లాడి ఫిర్యాదు అందజేశారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత సునీల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
Be the first to comment