Bhadradri Temple Mutyala Talambralu Damaged : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లక్షల విలువ చేసే ముత్యాల తలంబ్రాలు పాడైపోయాయి. గత సంవత్సరం సీతారాముల కల్యాణానికి తయారు చేసిన ముత్యాల తలంబ్రాలు చాలా ప్యాకెట్లు పక్కన పెట్టి ఉంచడం వల్ల తలంబ్రాల ప్యాకెట్ల లోపల బియ్యం పాడైపోయి పురుగులు చేరాయి. ప్యాకెట్ల లోపల పాడైన తలంబ్రాలను, ముత్యాలను అక్కడి సిబ్బంది వేరు చేస్తున్నారు. మొత్తంగా సుమారు ఐదు క్వింటాళ్ల తలంబ్రాల వరకు పాడైపోయినట్లు తెలుస్తోంది. పాడైన ప్యాకెట్లు లక్ష వరకు ఉంటాయని సమాచారం అందగా, ఆలయ అధికారులు మాత్రం 28 వేలని చెబుతున్నారు.
Be the first to comment