Visakha City Police Commissioner Sankhabrata Bagchi : ఏపీలో సైబర్ మోసాల బాధితులు విశాఖలోనే ఎక్కువ అనేది నిన్నటి మాట. విశాఖనే కేంద్రంగా చేసుకొని పలు ప్రాంతాల వారిని మోసగించే ముఠాలు ఉన్నాయనేది నేటి మాట. కొల్లగొట్టిన సొమ్మును కమీషన్ల ఆశ చూపి తీసుకున్న బ్యాంకు ఖాతాల నుంచి చట్టవిరుద్ధమైన పేమెంట్ గేట్‌వేల ద్వారా చైనాకు తరలించినట్లు వెలు గుచూసింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పలు సైబర్ నేరాల మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నట్లు తేలడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ముఖాముఖి