Minister Anitha Fires on Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని రూ.11కు పందేలు నడుస్తున్నాయని హోం మంత్రి అనిత వ్యంగాస్త్రాలు సంధించారు. రఘురామ స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఆయన శాసనసభకి రారని కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ జగన్ తాడేపల్లి నివాసంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్నా కోరం కూడా లేదని తెలిసిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్‌కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు.
Be the first to comment