Allu Arjun gets Bail : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. బన్నీ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సాయంత్రం 4 గంటల నుంచి సుమారు గంటన్నర పాటు ఇరువురు లాయర్లు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. పూర్తిస్థాయి బెయిల్‌కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది.
Be the first to comment