Family Members Carried Pregnant on Doli in Anakapalli District : అనకాపల్లి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు డోలీమోత కష్టాలు తీరలేదు. రాష్ట్రంలో అభివద్ధి కార్యక్రమాలు ఎన్నో పట్టాలెక్కుతున్నప్పటికీ ఆదివాసీ తండాలకు రహదారి సదుపాయాలు నేటికీ పూర్తిస్థాయిలో సమకూరలేదు. చినుకు రాలితే మట్టి రోడ్డు బురదమయం, జోరు వాన కొడితే ఇంటి నుంచి బయట కెళ్లలేని పరిస్థితులు. ఏళ్ల తరబడి డోలీ సాయంతో చికిత్సకోసం పరుగులు తీయాల్సిన పరిస్థితులు. పురుటి నొప్పి అయినా గుండెపోటైనా, పాముకాటైనా మరేదైనా వారికి డోలీమోతే దిక్కు. ఇప్పటికైనా మా కష్టాన్ని చూసి రోడ్లు వేయించడని విన్నవించుకుంటున్నారు గిరిపుత్రులు.
Be the first to comment