Wanaparthy District MPDO Office Rent Issue : వనపర్తి జిల్లా అమరచింత మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి అద్దె చెల్లించట్లేదని భవన యజమాని తాళం వేసి పెట్రోల్ డబ్బాతో బైఠాయించారు. మూడు సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోవడంతోనే కార్యాలయానికి తాళం వేసినట్టు తెలిపారు. ఈ కారణంగా గంటపాటు ప్రభుత్వ ఉద్యోగులు బయటనే ఉండాల్సి వచ్చింది. భవన అద్దె చెల్లించే వరకు కార్యాలయం లోపలికి ఎవ్వరిని రానివ్వనని తేల్చి చెప్పారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాసులు వచ్చి నచ్చచెప్పడంతో కార్యాలయానికి వేసిన తాళాన్ని తెరిచాడు.
Be the first to comment