Rented RTC Bus Stolen in Narsipatnam Depot of Anakapalli District : అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం రాత్రి అపహరణకు గురికావటంతో అధికారులతో పాటు సిబ్బంది షాక్కు గురయ్యారు. నర్సీపట్నం డిపో నుంచి నిరంతరం తుని తిరిగే బస్సు ఆదివారం రాత్రి విధులు పూర్తయ్యాక సిబ్బంది బస్సును డిపోలో పార్క్ చేశారు. తిరిగి ఈరోజు(సోమవారం) యథావిధిగా విధుల్లో భాగంగా తెల్లవారుజామున 4:30 గంటలకు డ్రైవర్ బస్సును తీసేందుకు వెళ్తే అక్కడ బస్సు లేదు.
Be the first to comment