పూర్వీకుల నుంచి తన కుటుంబానికి సంక్రమించిన భూమిని నకిలీ రికార్డులతో ఇతరులకు కేటాయించారంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు ఉతుకుతూ నిరసన తెలియజేశారు. శ్రీ సత్య సాయి జిల్లా కాలసముద్రం రెవెన్యూ గ్రామంలో రైతు గంగులప్పకు పెద్దలనుంచి భూమి సంక్రమించింది.