Janwada Farmhouse Case Update : రాష్ట్రంలో సంచలనం రేపిన జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు విజయ్ మద్దూరి పోలీసు విచారణకు హాజరయ్యారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో మోకిల పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన విజయ్‌ని పోలీసులు మధ్యాహ్నం 1.40 గంటల వరకూ విచారించారు. సోదాల సందర్భంగా పోలీసులకు సహకరించకపోవడం, ఇతరుల ఫోన్ ఇవ్వడం, కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం చుట్టూ పోలీసుల విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. విచారణ చేసిన పోలీసులు విజయ్ స్టేట్‌మెంటు రికార్డు చేసుకుని పంపించారు.
Be the first to comment