Miyapur Murder Case : ఓ మైనర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో యువకుడు పరిచయం అయ్యాడు. అతడు చెప్పిన మాయమాటలు విన్న బాలిక.. తనే సర్వస్వం అనుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి రహస్యంగా వెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన రోజు రాత్రే అతగాడి నిజస్వరూపం బయటపడింది. కాలయముడిలా తన స్నేహితుడి, స్నేహితుడి భార్యతో కలిసి యువతిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని తుక్కుగూడ వద్ద జరిగింది. మియాపూర్‌లో అదృశ్యమైన యువతి.. ఇలా తుక్కుగూడలో మృతదేహమై కనిపించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Be the first to comment