Margadarsi Branches Opened in Chikkaballapur : తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ కర్ణాటకలోని చిక్బళ్లాపుర నూతన బ్రాంచ్ని ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్. ప్రారంభ కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి నగదు స్వీకరించిన శైలజా కిరణ్ రశీదును అందించారు.
Be the first to comment