Margadarsi New branch inaugurated in Nirmal : ఉత్తర తెలంగాణలో నిర్మల్ కేంద్రంగా నూతనంగా ఏర్పాటుచేసిన మార్గదర్శి 123 వ బ్రాంచి ప్రారంభోతవ్సం అట్టహాసంగా జరిగింది. నిర్మల్ ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఎంఎస్ టవర్‌లోని రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన శాఖను ఈనాడు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.