Mines Department Ex Director Venkata Reddy Arrest: గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి సహకరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. గనుల శాఖ ఫిర్యాదు మేరకు ఈనెల 11న మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఇవాళ విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపర్చనుంది.
Be the first to comment