Flood Effect in Suryapet : సూర్యాపేట జిల్లాలో ప్రకృతి చేసిన విలయ తాండవానికి జిల్లా వాసులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి అపార నష్టానికి కారణమయ్యాయి. ఇళ్లు కోల్పోయి కొందరు పంట నష్టపోతే, కుటుంబ పెద్దను కోల్పోయి మరికొందరు తీరని శోకంలో ఉన్నారు. జిల్లాలో ఏ తలుపు తట్టిన కన్నీటిని మిగిల్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి. అటు వరదల కారణంగా పలు మండలాల్లో, గ్రామాల్లో రవాణా సౌకర్యం దెబ్బతింది. స్థానికులు, గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Be the first to comment