ఊహించని రీతిలో కురిసిన కుంభవృష్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీట మనిగి... రైతన్నలకు గుండెకోతను మిగిల్చాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో వేలాదిఎకరాల్లోని పంట నీటిపాలైంది. సాగు భూముల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కర్షకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వమే తము ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు.