BegumBazar Land and Building Prices : హైదరాబాద్ మహా నగరంలో అత్యంత ఖరీదైన భూములంటే కోకాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలు గుర్తొస్తాయి. ఇక్కడ ఎకరా భూమి రూ.100 కోట్లు పలుకుతుందంటే అంతా ఆశ్చర్యపోయారు. అంతకు మించిన ధర ఇంకెక్కడా ఉండదంటూ చర్చించుకున్నారు. కానీ పాతబస్తీని ఆనుకుని ఉన్న బేగంబజార్‌లో అంతకు రెట్టింపు ధర పలుకుతోంది. హోల్‌సేల్ మార్కెట్లకు నెలవైన బేగంబజార్‌లోని ఏ గల్లీలో అడుగుపెట్టినా భూ విక్రేతలకు కాసుల వర్షం కురుస్తోంది. పదేళ్లలో బేగంబజార్‌లో అనూహ్యంగా భూముల ధరలు అమాంతం పెరిగాయి.
Be the first to comment