cotton prices Decrease : మూడేళ్ల క్రితం DAP బస్తా ధర 1050 రూపాయలు ఉంటే... పత్తి క్వింటా ధర సగటున 9వేల రూపాయలు పలికింది. అదే DAP ధర ఇప్పుడు 1350 రూపాయలు పలికితే.. పత్తి ధర సగటున 7 వేల రూపాయలు లోపు ఉంటోంది. ఎరువుల ధరలు పెరిగినట్లు పత్తిధర పెరగకపోగా.. తగ్గటమేంటనే రైతులు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడులు భారమై.. మద్దతు ధర దక్కట్లేదని అంటున్న అన్నదాతల ఆవేదన అరణ్యరోదనగా మిగిలిపోతోంది. ఆదిలాబాద్ జిల్లా పత్తి పంట సాగులో ప్రసిద్ధిపొందింది. మేలిరకమైన నాణ్యతతో కూడిన పంట ఖండాంతర ఖ్యాతి గడించింది. అందుకే ఇక్కడ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చే సరకును..… ఎగుమతి చేసేటప్పుడు ఇతర ప్రాంతాల్లోని సరకుతో కలిపి విక్రయించటం ద్వారా మంచి ధరనే లభిస్తుందనే మాట వ్యాపారవర్గాల నుంచే వినిపిస్తోంది. కానీ పంట రైతుల దగ్గర ఉన్నప్పుడు కాకుండా వ్యాపారుల దగ్గర చేరిన తర్వాత ధరలు పెరగటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఫలితంగా... వచ్చే లాభం రైతులకు కాకుండా వ్యాపారులకు లబ్ధిచేకూరుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
Be the first to comment