KTR Fires On Rajiv Gandhi Statue : సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిపాదించిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. తెలంగాణ పౌరుషం, వైభవాన్ని చాటేలా అద్భుతంగా నిర్మించిన సచివాలయం సమీపంలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, పాలకులకు అమరవీరుల త్యాగాలని స్ఫూర్తిని జ్వలింపజేస్తూ అమరజ్యోతి స్మారకన్ని నిర్మించినట్లు వివరించారు.