BRS Leader KTR Fires on Congress Govt : రాష్ట్రంలో పండగ మాదిరి లేకుండా పోయిందని ఈసారి దసరా చేసుకునే పరిస్థితి లేకుండా భయానక వాతవరణం సృష్టించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మహ్మద్ అలాఉద్దీన్, పలువురు ఇతరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చి ఉండేవని కేటీఆర్ తెలిపారు. బతుకమ్మ ఆడుకునేందుకు లేకుండా డీజేలు కూడా బంద్ చేశారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. ఒక డిసెంబరు 9 పోయి మళ్లీ డిసెంబరు 9 వస్తోందని రైతుల రుణాలన్నీ మాఫీ కాలేదని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తామన్నారు కానీ తులం ఇనుము కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. 1.70 కోటి మంది మహిళల్లో ఒక్కరికి కూడా రూ.2500 రాలేదని ధ్వజమెత్తారు.
Be the first to comment