KTR Slams On Congress Over Party Defections : ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించింది కాంగ్రెస్సే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే హస్తం పార్టీ అని ధ్వజమెత్తారు. 2014కు ముుందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు 9 సార్లు అధికారమిచ్చారు, కానీ ఆ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. రాష్ట్రంలో మొదటి పదేళ్లు కేసీఆర్ నేతృత్వంలో మంచి పాలన అందిందని పేర్కొన్నారు.