Raghu Rama Krishna Raju Custodial Torture Case: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి సునీల్ కొట్టించారని వారు తెలిపారు. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడీ చీఫ్ సెల్‌ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.
Be the first to comment