Tungabhadra Dam Gate Collapsed: తుంగభద్ర డ్యాం 19వ గేటు వరద తాకిడికి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కులు విడుదలవుతోందని, కర్నూలు - మహబూబ్ నగర్ జిల్లాల్లోని పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ప్రాజెక్టు తాజా పరిస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆదేశించారు.
Be the first to comment