TGNAB on Drugs in Educational Institutions : మాదకద్రవ్యాల కట్టడికి టీజీన్యాబ్ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా యువత, విద్యార్ధులు మాదకద్రవ్యాల కోరల్లో చిక్కుకుని తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. కొన్ని నెలల వ్యవధిలో దాదాపు 12 విద్య సంస్థల్లోకి మత్త పదార్ధాలు చేరినట్లు పోలీసులు ఆధారాలతో నిరూపించారు. యాంటీ నార్కొటిక్స్ బ్యూరో విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంసల్లో ఆకస్మికంగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్షేత్రసాయిలో సాధ్యసాధ్యాలను చర్చించి వీలైంనంత త్వరితగతిన అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
Be the first to comment