Telangana Govt Conduct International Anti-Drug Day Program : ప్రస్తుత కాలంలో డ్రగ్స్ మహమ్మారి తెలంగాణతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళావేదికలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, డీజీపీ రవిగుప్తా, టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హీరో తేజ సజ్జ, సుమన్, మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
Be the first to comment