Indian Pharmaceutical Congress 2024 : ఫార్మారంగంలో జరుగుతున్న ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇంతింతై వడుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న ఫార్మాసూటికల్ రంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ వేదికైంది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 73వ ఐపీసీ సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ రంగానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Be the first to comment