CM Revanth Inaugurate Gopanpally Flyover : తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశం నలుమూలల నుంచి ఎవరొచ్చినా అక్కున చేర్చుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లోని గోపనపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. పై వంతెనను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఫ్లైఓవర్ పైకి ఉమెన్ బైకర్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "గోపనపల్లి ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ది చెందుతుంది. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిది. హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా అనే వ్యవస్థను తీసుకువస్తున్నాం. చిన్న వర్షం పడినా మన కాలనీలు మురికి కాల్వలు అయిపోతున్నాయి. మూసీని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తాం". అని వెల్లడించారు.
Be the first to comment