Public Facing Problems With Damaged Roads : గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. నిధులు మంజూరు చేసినా, బిల్లులు సకాలంలో చెల్లించకపోవటంతో పనులు సగంలో ఆగిపోయాయి. ఫలితంగా రోడ్లపైన ప్రయాణమంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి.