Justice PC Ghose Commission on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇక ఆర్థికపరమైనశాఖలపై దృష్టిసారించనుంది. సాంకేతికపర అంశాల విచారణ దాదాపుగా పూర్తికావడంతో తదుపరి ప్రక్రియకు కమిషన్ సిద్ధమవుతోంది. అధికారుల గణాంకాలతో పాటు కాగ్ నివేదిక ఆధారంగా ఆర్థికపరమైన అంశాలపై విచారణ చేయనుంది. గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వారందరి నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత తదుపరి చర్యలను కమిషన్ చేపట్టనుంది.