Skip to playerSkip to main content
  • 8 years ago
According to a leading daily, Tollywood actress Anushka has been suffering from a backache for quite a while and it has hindered her fitness regime.

గత కొన్నేళ్లుగా తెలుగు హీరోయిన్ అనుష్క విరామం లేకుండా పని చేస్తున్నారు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజి బిజీగా గడుపుతున్నారు. అందులో రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2 లాంటి భారీ యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. సైజ్ జీరో లాంటి సినిమాల కోసం బరువు పెరగడం, తర్వాత 'భాగమతి' కోసం తగ్గడం లాంటివి చేశారు. ఇలా అలుపు లేకుండా కష్టపడుతున్న అనుష్కకు కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధ పడుతున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలానే తీవ్రమైన బ్యాక్ పెయిన్‌తో బాధపడిన సంగతి తెలిసిందే.
‘భాగమతి' సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనుష్క మరో కొత్త సినిమాకి సంతకం చేయలేదు. అందుకు కారణం నడుము నొప్పి అని అంటున్నారు. నొప్పిని భరిస్తూనే కొన్ని రోజులు ‘భాగమతి' షూటింగులో పాల్గొన్నారట అనుష్క.

Be the first to comment
Add your comment

Recommended