Skip to playerSkip to main content
  • 8 years ago
Actress Jayasudha recently given an interview to a youtube channel. In that she remembered her relationship with Shobhan Babu and Krishna

సహజనటి జయసుధ తన సినీ అంతరంగంపై ఓ యూట్యూబ్ చానెల్‌లో మనసు విప్పి మాట్లాడారు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు.. అలాగే కో-స్టార్స్‌తో అనుబంధం గురించి పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పటి సోగ్గాడు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణల గురించి ఆమె చెప్పిన పలు విశేషాలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.
ఇంటర్వ్యూలో భాగంగా శోభన్ బాబు గురించి ప్రస్తావించిన యాంకర్.. ఆయన అందం గురించి ప్రశ్నించారు. శోభన్ బాబు గారిని ఈ తరంలో చాలామంది చూడలేదు కదా.. తను నిజంగా అంత హ్యాండ్సమా?.. అని అడిగారు. యాంకర్ ప్రశ్నకు నవ్వుతూ బదులిచ్చిన జయసుధ.. 'అవును ఆయన చాలా హ్యాండ్సమ్' అని చెప్పారు. అయితే అంతకన్నా కృష్ణ గారు కూడా హ్యాండ్సమ్‌గా ఉండేవారన్నారు. కానీ వీరిద్దరికీ ఓ విషయంలో మాత్రం చాలా తేడా ఉందన్నారు.
ఇద్దరూ అందగాళ్లే అయినప్పటికీ.. కృష్ణ చాలా తక్కువగా మాట్లాడేవారని జయసుధ చెప్పారు. అవసరమైతే తప్ప పెద్దగా మాట్లాడే మనస్తత్వం కాదని అన్నారు. కృష్ణ అంటే, తనకూ ఒకరకమైన భయం ఉండేదని, బహుశా.. తన అంకుల్ కావడం వల్లనేమో! అని చెప్పుకొచ్చారు. అయితే శోభన్ బాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండేవారని చెప్పారు. చాలామంది హీరోయిన్లు ఆయనతో వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారని గుర్తుచేసుకున్నారు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసని చెప్పారు.
14-15ఏళ్ల వయసున్నప్పుడే జయసుధ ఎన్టీఆర్ లాంటి సీనియర్ హీరోలతో కలిసి ఆడిపాడారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన యాంకర్.. వయసులో అంత తేడా ఉన్నా.. కలిసి నటించడం ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదా?.. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా అనిపించేదని అడిగారు. మొదట్లో తనకు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పలికించాలనేది సరిగ్గా తెలిసేది కాదని జయసుధ అన్నారు. ఒకానొక సందర్భంలో ఓ డైలాగ్ చెప్పడానికి తాను చాలా ఇబ్బందిపడ్డానని గుర్తుచేసుకున్నారు.
ప్రకాష్ రాజ్ తో కలిసి పేరెంట్స్ క్యారెక్టర్స్ కు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు జయసుధ. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రకాష్ రాజ్ తో అనుబంధం గురించి అడిగారు. దీనికి నవ్వుతూ బదులిచ్చిన జయసుధ.. 'హాయ్ ప్రకాష్.. బై ప్రకాష్.. అని చెప్పడం తప్ప ఆయన నేనూ ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు' అని చెప్పారు.
Be the first to comment
Add your comment

Recommended