Skip to playerSkip to main content
  • 8 years ago
Tollywood actor Samrat Reddy was arrested on Monday evening following a complaint filed by his wife.

నటుడు సామ్రాట్ రెడ్డిలో బయటకు కనిపించని కోణాలు చాలానే ఉన్నాయా?.. పైకి జెంటిల్‌మెన్‌లా పోజు కొడుతూ అవలక్షణాలన్నీ ఒంటపట్టించుకున్నాడా?.. సామ్రాట్ భార్య, అతని మామ చేస్తున్న ఆరోపణలు వింటుంటే బహుశా ఇవన్నీ నిజమేనేమో అనిపించకమానదు.
డ్రగ్స్, సెక్స్.. ఈ రెండు సామ్రాట్‌కు వ్యసనంగా తయారైనట్లు అతని భార్య హర్షితా రెడ్డి, మామ ఆరోపిస్తున్నారు. కాల్ గర్ల్స్‌తో సంబంధాలు మాత్రమే కాకుండా.. విడాకులు తీసుకున్న ఇద్దరు మహిళలతోనూ సామ్రాట్ సంబంధం పెట్టుకున్నాడని అతని మామ ఆరోపించారు. అంతేకాదు, సామ్రాట్‌కు ఒక 'గే' ఫ్రెండ్ ఉన్నాడని, సామ్రాట్ ఒక 'బైసెక్సువల్' అని ఆరోపించారు.
సామ్రాట్, అతని గే ఫ్రెండ్ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరని అతని మామ ఆరోపించారు.
అమ్మాయిలతో సంబంధాల గురించి సామ్రాట్ తల్లికి చెప్పితే.. ఆమె తననే దబాయించిందని హర్షితా రెడ్డి అన్నారు. కొడుకుకి బుద్ది చెప్పాల్సిందిపోయి.. 'ఊరి నుంచి వచ్చినవాళ్లకు ఏమి తెలుస్తాయి.. ఇది బంజారాహిల్స్.. ఇక్కడ ఇలాగే ఉంటారు' అంటూ తనకే క్లాస్ పీకేదని అన్నారు.
బయటకు వెళ్లినప్పుడు తనపట్ల విపరీతమైన ప్రేమ కనబరుస్తున్నట్లు నాటకాలు ఆడేవాడని, ఇంటికొచ్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించేవాడని హర్షితా తెలిపారు. ఎప్పటికైనా మారుతాడన్న ఆశతో సామ్రాట్ గురించి ఎన్ని విషయాలు తెలిసినా, మనసులో బాధపడ్డానే తప్ప బయటపెట్టలేదని, చాన్నాళ్లు ఎదురు చూశానని హర్షిత వాపోయింది.
Be the first to comment
Add your comment

Recommended