తెలుగు telugu install joomla etc easily Full HD Nallamotu

  • 13 years ago
మీ వెబ్ సైట్ లో Joomla, Drupal, Wordpress, phpBB వంటివి ఎంత ఈజీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చో చూడండి (వీడియో డెమో)
మీకొక స్వంత వెబ్ సైట్ ఉందనుకుందాం. దానిలో Joomla, Drupal వంటి కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లను గానీ, Wordpress, Blogger వంటి బ్లాగింగ్ స్ర్కిప్ట్ లను గానీ, లేదా chat సదుపాయాన్ని అందించే phpfreechat వంటి వాటినీ.. ఇలా వేర్వేరు స్ర్కిప్ట్ లను ఇన్ స్టాల్ చేయవలసి వస్తే ముందు వాటిని డౌన్ లోడ్ చేసుకుని unzip చేసుకుని, ftp ద్వారా మీ హోస్టింగ్ స్పేస్ లోకి అప్ లోడ్ చేసుకుని.. మరోవైపు SQL డేటాబేస్ లను క్రియేట్ చేసుకుని ఆ డేటాబేస్ వివరాలను config.php వంటి ఫైళ్లలో సేవ్ చేసి.. install.phpని రన్ చేయడం.. చాలా పెద్ద ప్రాసెస్ గా అన్పించడం లేదూ..? ఈ ప్రాసెస్ ని టైప్ చేయడానికే నాకు చిరాకు వస్తే రియల్ టైమ్ లో ఇంత పని చేయాలంటే ఇంకెంత చిరాకు వస్తుందో మీకు తెలిసిందే కదా!

మరి దీనికి సింపుల్ సొల్యూషన్ లేదా?

ఎందుకు లేదు.. ఉంది! ఈ క్రింది వీడియోలో Wordpress, Joomla వంటి వివిధ పాపులర్ స్ర్కిప్ట్ లను ఎంత ఈజీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు