State Level Bullock Cart Pulling Competition In Kadapa District: అవధూత కొండయ్య స్వామి పుట్టినరోజు వేడుక సందర్భంగా కడప జిల్లా మైదుకూరు మున్సిపాల్టీ పరిధిలోని ధరణి తిమ్మాయపల్లెలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 9 జతల ఎడ్లు పోటీలకు తరలివచ్చాయి. పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచిన ఎడ్ల జతకు 5 లక్షల రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వృషభరాజాలకు 3 లక్షల రూపాయలు అందించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బండలాగుడు పోటీలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పశుపోషకులు తరలివచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన జనం పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిర్వహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజలంతా కేరింతలు కొడుతూ పోటీలు తిలకించారు. ప్రతీ ఏడాది ఎద్దుల బండ లాగుడు పోటీల నిర్వహణ సాప్రదాయంగా కొనసాగుతుంది.