Skip to playerSkip to main content
  • 1 hour ago
Huge Fire Accident Happened In Ichchapuram In Srikakulam : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక దాసన్నపేటలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న రామకృష్ణ ప్లాస్టిక్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు గోదాము అంతటా వ్యాపించి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో గోదాములోని సరుకు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. గోదాము నుంచి భారీగా మంటలు ఎగసిపడటంతో పాటు పక్కనే ఉన్న 'మేఘన లేడీస్ కార్నర్' షాపునకు సైతం మంటలు వ్యాపించడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే గోదాములోని వస్తువులు చాలావరకు కాలి బూడిదయ్యాయి. అలాగే మేఘన లేడీస్ కార్నర్‌లో కూడా మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. అనంతరం ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన పూర్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:03This is the first time of the day of the day of the day of the day.
00:32It is ayard корow.
00:39The environment has been set up to the 8th century model.
00:47When you have a reduced income level, you have to be careful just taking a while.
00:52The first thing I wanted to do was just taking a $2.
00:52It is a pre-trail for a long time.
00:59Hey! Go!
01:01Go!
01:02Go!
01:02Go!
01:03Go!
01:04Go!

Recommended