Skip to playerSkip to main contentSkip to footer
  • 5/14/2025
Grievance in TDP Central Office in Mangalagiri : తన కుమారులు ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఇప్పుడు పట్టించుకోవడంలేదని గుంటూరుకు చెందిన దూలిపర్తి దమయంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తిని తిరిగి ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆప్కాబ్‌ ఛైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, గౌడ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వీరంకి గురుమూర్తి బాధితులు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణను నిలిపి వైఎస్సార్సీపీ నాయకుల వెంచర్‌కు సమీపంగా వెళ్లేలా గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు చేపట్టారని నంద్యాల మండలం రైతునగరం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

Category

🗞
News

Recommended