Vallabhaneni Vamsi Arrest in Hyderabad : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఉన్న ఆయన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి విజయవాడ భవానీపురం పీఎస్‌కు తరలించిన పోలీసులు అక్కడ నుంచి మరో వాహనంలో వంశీని తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని వంశీపై ఫిర్యాదు నమోదైంది. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు.
Be the first to comment